అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సలాం ప్రొద్దుటూరు (పుట్టపర్తి): శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కదిరి మరియు ధర్మవరం రెవెన్యూ డివిజన్లలో ఖాళీగా ఉన్న 230 అంగన్‌వాడీ సహాయకురాలు (ఆయా) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిణి శ్రీమతి కె. ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. కదిరి, నల్లచెరువు, ధర్మవరం, బత్తలపల్లి, సి.కె.పల్లి ఐ.సి.డి.యస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 09-06-2026 నుండి 18-06-2026 సాయంత్రం...