ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్ముగిసిన ఎన్డీఏ పక్షాల సమావేశం

ముగిసిన ఎన్డీఏ పక్షాల సమావేశం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (అమరావతి):

సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎన్డీఏ పక్ష నేతలు.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణ.

తిరుపతి, అమరావతి, విశాఖలో బహిరంగ సభలు.

రాజ్యసభ సీట్లపై ఎన్డీఏ సమావేశంలో కీలక నిర్ణయం.

టీడీపీ 3 సీట్లు, జనసేన 1 సీటు తీసుకోవాలని నిర్ణయంచిన ఎన్డీఏ నేతల సమావేశం.

పల్లా శ్రీనివాసరావు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తాం.

• 9వ తేదీన తిరుపతి, 12వ తేదీని అమరావతి, 15వ తేదీన విశాఖలో బహిరంగ సభలు.

• తిరుపతిలో సంక్షేమం, అమరావతిలో సుపరిపాలన, విశాఖలో అభివృద్ధి అంశాలపై బహిరంగ సభలు.

• ఈ నెల 13, 16, 17,18,19, 20 వరకు జిల్లాల్లో రెండేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్తాం.

• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై నిర్వహించే క్యాంపెయిన్ షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తాం.

• SIR మీద ఈ సమావేశంలో చర్చించాం.

• నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీ-3, జనసేన-1 తీసుకోవాలని నిర్ణయం.

 

నాదెండ్ల మనోహర్, మంత్రి

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి-సంక్షేమం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాం.

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించే కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు.

• 24 నెలల పాలనలో చేపట్టిన 24 ప్రధాన కార్యక్రమాలు.. పథకాలపై ప్రచారం చేపడతాం.

• ఈ కార్యాచరణ ద్వారా ప్రజల ఆశీస్సులను మరోసారి కోరతాం.

• జనసేన రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది మా అధినేత ప్రకటిస్తారు.

 

*మాధవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు*

• కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలన, ప్రధాని 12 ఏళ్ల పాలనలో వల్ల ప్రజలకు కలిగిన మేలును వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లనున్నాం.

• ఎన్డీఏ ప్రభుత్వం వల్ల దేశంలో, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, వచ్చిన మార్పులను ఈ ప్రచార సభల్లో ప్రజలకు వివరిస్తాం.

• ఈ నెల 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి.. ఆ రోజు నుంచి కార్యాచరణను అమలు చేయాలని సీఎం సూచించారు.

• రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పోలవరం, అమరావతి నిర్మాణాలు, విశాఖ రైల్వే జోన్ వంటి అనేక అంశాలపై ప్రజల్లోకి వెళ్తాం.

• టీడీపీ-జనసేనకు రాజ్యసభ సీట్లు ఉంటే బీజేపీకీ ఉన్నట్టే.

• ఇంకా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరించడం మంచిది కాదు.

• బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉండడం కొందరికి కంటగింపుగా మారింది.

• కొందరు స్వయం ప్రకటిత మేథావులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.

• మేం కలిసే ఉంటాం… ఒక్కటిగా ఉంటాం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!