సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు) :
మైదుకూరు మున్సిపాలిటీ 6వ వార్డులో విద్యుత్ స్తంభాలపై చెట్ల కొమ్మలు పెరగడంతో గత కొంతకాలంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులను సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఏఈ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ స్తంభాలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. దీంతో విద్యుత్ సరఫరా సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టారు.
ప్రజల సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు, అలాగే సమస్యను త్వరితగతిన పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి 6వ వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు రాకెట్ రఫీ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి అధికారులతో సమన్వయం చేసి పరిష్కారం చూపడం అభినందనీయమని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో ఇలాంటి వేగవంతమైన చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు.
