ePaper
Monday, July 27, 2026
ePaper
Homeఎడిటోరియల్కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభించిన ఏఎస్పీ విభూకృష్ణ

కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభించిన ఏఎస్పీ విభూకృష్ణ

📰 Generate e-Paper Clip

సోమవారం పట్టణంలోని గాంధీ రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంకు పై అంతస్తులో కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మైదుకూరు రోడ్డులోని ఆరవేటి థియేటర్ నుంచి శివాలయం రోడ్డు, టిబి రోడ్డు, గాంధీ రోడ్డు మీదుగా బ్రాంచ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్సవ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ విభూకృష్ణ హాజరయ్యారు. కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ సంస్థ సేవలను ప్రశంసించారు. ప్రజలకు మరింత చేరువగా ఇన్సూరెన్స్ సేవలు అందించడంలో కోటక్ లైఫ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఆయనకు నిర్వాహకులు శ్రీకృష్ణుని చిత్రపటం అందించి సత్కరించారు. ప్రొద్దుటూరు ఆర్థికంగా దక్షిణ భారతదేశంలో ప్రముఖ పట్టణంగా అభివృద్ధి చెందుతోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ఇంచార్జ్ కె.ఎన్.రెడ్డి మాట్లాడుతూ, ప్రొద్దుటూరు అఫీషియల్ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. పట్టణ ప్రజలకు మెరుగైన ఇన్సూరెన్స్ సేవలు అందించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి ఇన్సూరెన్స్ రక్షణ కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సంస్థ పని చేస్తోందని వివరించారు.ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ శ్రీనాథ రెడ్డి, ఎల్ఎంపి మురళీ రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ దేవకుమార్, ఏజెన్సీ పార్ట్నర్లు, అడ్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!