సలాం ప్రొద్దుటూరు :
–అన్నదాతల ఖాతాల్లోకి సంక్షేమ కానుక
–అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ నిధులను విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
రైతులకు పెట్టుబడి భారం తగ్గించి,వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ పథకం తొలి విడత సాయాన్ని ప్రభుత్వం నేడు విడుదల చేసింది.
ప్రొద్దుటూరు నియోజకవర్గం లోని MPDO కార్యాలయం నందు నిర్వహించిన “అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్” నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రైతులకు 10,201 మంది లబ్ధిదారులకు 6 కోట్ల 95 లక్షల రూపాయలు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలలో జమ కావడం జరిగింది.రైతు సంక్షేమం,వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ,రైతు కుటుంబాల ఆర్థిక బలోపేతానికి ఇటువంటి పథకాలు ఎంతో దోహదపడుతున్నాయని ఆయన చెప్పారు.అన్నదాత సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని,రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ AD అనిత ,AO లు వరహరి ,రామకృష్ణారెడ్డి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ ,రాజుపాలెం మండలం,ప్రొద్దుటూరు మండలం రైతులు పాల్గొన్నారు.
