సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మండలం పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ MPDO కార్యాలయం లో మండలం ప్రజా పరిషత్ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడారు .జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.6 కోట్ల తాగునీటి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.ఆవాస్ ప్లస్ పథకం కింద ప్రతిపాదించిన 3,200 ఇండ్లను త్వరగా మంజూరు చేయించాలని అధికారులను కోరారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా స్మార్ట్ కిచెన్ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అమృత్‌నగర్ ఉర్దూ పాఠశాలకు నూతన భవనం నిర్మాణం కోసం స్థలాన్ని గుర్తించి చర్యలు చేపట్టాలని కోరారు.లింగాపురం-తాళ్లమాపురం మార్గంలో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.మైలవరం కాలువ కింద మంజూరైన పనులకు సంబంధించిన సెటర్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో MPDO సూర్యనారాయణ రెడ్డి ,MRO ఉదయ భాస్కర్ రాజు ,మండాలధ్యక్షుడు,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
