ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్దేశ ఓటర్ భవిష్యత్తును అత్యంత ప్రమాదంలో

దేశ ఓటర్ భవిష్యత్తును అత్యంత ప్రమాదంలో

📰 Generate e-Paper Clip

 

–బీహార్ లో ఎస్ ఐ ఆర్ తర్వాతే ఆక్రమాలు వెలుగులోకి వచ్చాయి

–ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సులో డాక్టర్ బ్రహ్మ రెడ్డి

సలాం ప్రొద్దుటూరు :

 

ఈ దేశ ఓటర్ భవిష్యత్తును అత్యంత ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఓటర్ సర్వే ఎస్ అయ్యారని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక నాయకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో స్థానిక ఏకేఆర్ ఫంక్షన్ హాల్లో ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు ఎస్ఐఆర్ నిర్వహించిన రాష్ట్రాలలో కోట్లాదిమంది ఓటర్లను తొలగించారన్నారు. బీహార్ లో ఎస్ ఐ ఆర్ ముగిసిన తర్వాత ఫైనల్ లిస్టులో ఒక అడ్రస్ లో 900 ఓటర్లు ఉన్నారన్నారు. కానీ తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఒక్క ఓటరు లేరన్నారు. దీన్ని బట్టి ఎస్ఐఆర్ నిజంగా దొంగ ఓట్లను మరణించిన వారి ఓట్లనే తొలగిస్తుందని గ్యారెంటీ లేదన్నారు. అభ్యర్థుల ఓట్లు లెక్కించి ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వెల్లడించి గెలుపును ప్రకటించడం ఎన్నికల కమిషన్ పని అన్నారు. కానీ ఈ దేశంలో ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థిని ప్రకటించాక ఓట్ల లెక్కింపు వివరాలు చెబుతున్నారంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యంకు ఏ గతి పట్టిందో అర్థం అవుతుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ లో 2002లో మీరు ఎక్కడ ఓటేశారు ఏ బూతులో వేశారు ఏ పార్ట్ నెంబర్ మీది అనే వివరాల తో సహా నేడు ఎన్నిమిరేషన్ ఫామ్ లో పూర్తి చేస్తేనే మీ ఓటింగ్ మ్యాపింగ్ అవుతుందన్నారు. లేకుంటే మీ ఓటు గల్లంతే అన్నారు. జులై 14 ఇంటింటి ఓటర్ సర్వే పూర్తయి జూలై 21న ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటిస్తారన్నారు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు ఇప్పట్లో ఎన్నికలు లేవు కదా అని మరి కావాల్సిన సమయం ఇచ్చి ఈ ఎస్ ఐ ఆర్ ను పూర్తి చేయొచ్చు కదా అనే ప్రశ్నలు వస్తున్నాయన్నారు. 9 నెలల కంటే తక్కువ నెలలో పుట్టిన బిడ్డ ఉంటే తల్లిదండ్రులకు పిల్లలకు 15 ఏళ్ల వ్యత్యాసం ఉంటే మీ ఓటు హక్కు కోల్పోతున్నారు అన్నారు ఓటర్ను ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి చర్యలు ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేపట్టడంలో ఉన్న అంతర్యం ఏమిటి అనే దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నారు. ఈ దేశంలో నాలుగవసారి అధికారంలోకి రావడానికి పాలక పార్టీ పండిన వ్యూహంగా ఎస్ఐఆర్ను రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జై భారత్ జాతీయ అధ్యక్షుడు లోక్నాథ్ జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వ సురేష్, జిల్లా అధ్యక్షుడు పల్లవోలు రమణ, ప్రధాన కార్యదర్శి శివరాం, విరసం వరలక్ష్మి, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సర్పంచ్ ల సంఘం జిల్లా పూర్వ అధ్యక్షుడు శివచంద్రారెడ్డి, డా. నరసింహారెడ్డి, మురుకూటి సూర్యనారాయణ రెడ్డి, జమాతే ఇస్లాం రెహన, షఫీ, సిపియం సత్యం, సియంఐ రామయ్య, సుబ్బరాయుడు, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దస్తగిరి రెడ్డి, మల్లేల భాస్కర్, ప్రగతిశీల కార్మిక సమాఖ్య సృజన శ్రీను,నాగేంద్ర, రాయలసీమ మహిళా శక్తి లక్ష్మిదేవి, అడ్వకేట్ దాదాహయత్, హరిత, జెవివి రమణయ్య, పిళ్ళా కుమారస్వామి రెడ్డి, కవి మహమూద్, జింకా, స్నేహ సేవా సమితి మధు, వ్య.కా.సం. డేవిడ్, ఐద్వా ముంతాజ్, ఇన్నర్ వీల్ భారతి, ఉషారాణిసుబ్ఫయ్య, పోలంకి శ్రీరాములు, యల్లయ్య, రాజశేఖర్, నంగా రాజేష్, సునీత, గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!