ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి

నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

హిందూపురం శాసనసభ్యులు, ప్రముఖ చలనచిత్ర నటుడు, ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లేల లింగారెడ్డి మాట్లాడుతూ, నందమూరి తారకరామారావు వారసుడిగా సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ బాలకృష్ణ తనదైన ముద్ర వేశారని కొనియాడారు. హిందూపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ఆదర్శవంతమైన నాయకుడిగా నిలిచారని ప్రశంసించారు. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మంది పేద రోగులకు ఉచిత వైద్యం అందిస్తూ బాలకృష్ణ చేస్తున్న సామాజిక సేవ ఎంతో అభినందనీయమన్నారు.భగవంతుడు బాలకృష్ణ కి సంపూర్ణ ఆయురారోగ్యాలను, అప్లైశ్వర్యాలను ప్రసాదించాలని, ఆయన ప్రజాసేవలోనూ, సినీ రంగంలోనూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మల్లేల లింగారెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు పాల్గొని బాలకృష్ణ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!