నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి

సలాం ప్రొద్దుటూరు: హిందూపురం శాసనసభ్యులు, ప్రముఖ చలనచిత్ర నటుడు, 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లేల లింగారెడ్డి మాట్లాడుతూ, నందమూరి తారకరామారావు వారసుడిగా సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ బాలకృష్ణ తనదైన ముద్ర వేశారని కొనియాడారు. హిందూపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ఆదర్శవంతమైన నాయకుడిగా నిలిచారని ప్రశంసించారు. ముఖ్యంగా బసవతారకం...