ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్చిన్నారి చికిత్స కు ₹16 కోట్ల ఇంజెక్షన్

చిన్నారి చికిత్స కు ₹16 కోట్ల ఇంజెక్షన్

📰 Generate e-Paper Clip

ఎస్ఎంఎ-2 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి

సలాం ప్రొద్దుటూరు :
పట్టణంలోని వైఎంఆర్ కాలనీ, భవానీనగర్‌కు చెందిన కాశీ విశ్వనాథ్, బాలలింగమ్మ దంపతుల కుమారుడు వర్షిత్ నాథ్ అరుదైన ఎస్ఎంఎ-2 (స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ) వ్యాధితో బాధపడుతున్నాడని, అతని చికిత్స కోసం దాదాపు రూ.16 కోట్ల విలువైన ప్రత్యేక ఇంజక్షన్ అవసరమని మానవతావాదులు తెలిపారు.
బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మానవతావాదులు లక్ష్మీ ప్రసన్న, నాగలక్ష్మి, చిన్నారి తండ్రి స్నేహితుడు నరసింహ మాట్లాడుతూ, ఇంజక్షన్ అందే వరకు చిన్నారికి ఇవ్వాల్సిన ప్రత్యేక సిరప్ ఒక్కటి దాదాపు రూ.16 వేల ఖర్చవుతుందని చెప్పారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిన్నారి తండ్రి కాశీ విశ్వనాథ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో చికిత్స ఖర్చులు భరించడం కష్టంగా మారిందన్నారు.
దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ముందుకు వచ్చి చిన్నారి చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని తల్లి బాలలింగమ్మ విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం 7095148237 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!