ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మట్టి మసీద్ వీధిలో ఆధ్యాత్మిక శోభ.. ఘనంగా గ్యార్వి వేడుకలు

మట్టి మసీద్ వీధిలో ఆధ్యాత్మిక శోభ.. ఘనంగా గ్యార్వి వేడుకలు

📰 Generate e-Paper Clip

 

–దస్తగిరి స్వామి గ్యార్వి షరీఫ్‌కు భక్తుల హాజరు..

–వేలాదిమందికి అన్నదానం

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలోని మట్టి మసీద్ వీధిలో ఆదివారం దస్తగిరి స్వామి గ్యార్వి షరీఫ్ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దస్తగిరి స్వామి నెల సందర్భంగా ప్రతి ఏడాది దస్తూ మియా అండ్ సన్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి.వేడుకల సందర్భంగా మట్టి మసీద్ వీధిలో జెండా చెట్టు వద్ద, పరిసరాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. శనివారం రాత్రి కమలాపురం షేక్ ఖాదర్ వలీ ఆధ్వర్యంలో పెద్ద జెండాల ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.ఆదివారం ఉదయం గ్యార్వి షరీఫ్ సందర్భంగా వేలాదిమంది భక్తులు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వి.ఎస్. ముక్తియార్ హాజరయ్యారు.ప్రభుత్వ ఖాజీ షేక్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో హజరత్ సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి (దస్తగిరి స్వామి) వారికి ఫాతిహా నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, సమాజంలో శాంతి, సోదరభావం వెల్లివిరియాలని ప్రత్యేక దువా చేశారు. కార్యక్రమంలో స్థానికులు, భక్తులు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!