–చైర్మన్‌గా వెంకటేశ్వరరావు.. వైస్‌చైర్మన్‌గా సుధారాణి
–నూతన కమిటీని సన్మానించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్
సలాం ప్రొద్దుటూరు:
ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం గోపవరం ఎంపీయూపీ స్కూల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా వెంకటేశ్వరరావు, వైస్‌చైర్మన్‌గా సుధారాణిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్చైర్మన్లను మార్కెట్ యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతుల కల్పనకు ఎస్ఎంసీ కమిటీ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో బాలు భాష, సుబ్బా,శీను, సుబ్బారావు, డీలర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

