ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్దస్తగిరిపేటలో ఆధ్యాత్మిక సందడి.. ఘనంగా గంధం–పెద్ద జెండా మహోత్సవం

దస్తగిరిపేటలో ఆధ్యాత్మిక సందడి.. ఘనంగా గంధం–పెద్ద జెండా మహోత్సవం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

పట్టణంలోని దస్తగిరిపేట వీధిలో ఉన్న  హజరత్ మహబూబ్ సుబహాని రహ్మతుల్లాహి అలైహి (దస్తగిరిస్వామి జెండాచెట్టు) దర్గా గంధం–పెద్ద జెండా మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద జెండాలు, చిన్న జెండాలు, గంధం, పూలను  అలీబాష ఖాద్రి అల్ చిష్టి  నివాసం నుంచి భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చారు.దస్తగిరిపేట నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు జిన్నా రోడ్డు, మైదుకూరు రోడ్డు, పుట్టపర్తి సెంటర్ మీదుగా సాగి తిరిగి దర్గా వద్దకు చేరుకుంది. ఊరేగింపు మార్గమంతా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.పూల చాందినీలు, ఫకీర్ల డప్పులు, డ్రమ్స్, పలకల వాయిద్యాలు, భక్తి గీతాలు, ఖవ్వాలి పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆస్థానే మహబూబ్ సుబహాని కొత్త ఖాదరాబాద్ పీఠాధిపతి హజరత్ పీర్ సయ్యద్ అబ్దుల్ రజాక్ బాద్షా ఖాద్రి అల్ చిష్టి ఇఫ్తెకారి జొహరేపీర్ స్వామి, అల్లాబకష్ ఖాద్రి రెహమతే పీర్, అలీబాష ఖాద్రి అల్ చిష్టి స్వామి, ఆయన కుమారుడు ఎం.ఎస్. ఇలియాస్ ఖాద్రి, ప్రముఖ దస్తావేజు లేఖరి ఎస్. అక్బర్ వల్లీ, ఎం.ఎస్. లతీఫ్, మునిసిపల్ ఆర్.ఐ. షఫీవుల్లా, మదీనా డి.జె. గౌస్ బాషా, కూరగాయల వ్యాపారి ఆజం తదితరులు పాల్గొన్నారు.అలాగే స్వామివారి యువజన భక్తులతో పాటు ప్రొద్దుటూరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన హిందూ, ముస్లిం, దూదేకుల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మతసామరస్యాన్ని చాటుతూ సాగిన ఈ వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఊరేగింపు అనంతరం దర్గా వద్ద భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తిశ్రద్ధలు, ఖవ్వాలి గీతాలు, వాయిద్యాల నడుమ గంధం–పెద్ద జెండా మహోత్సవం విజయవంతంగా ముగిసింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!