ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్స్వర్ణ వార్డు సచివాలయంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ తనిఖీలు

స్వర్ణ వార్డు సచివాలయంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ తనిఖీలు

📰 Generate e-Paper Clip

 

 

–ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై అధికారుల పరిశీలన..

–గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని నడింపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆదర్శనగర్‌ స్వర్ణ వార్డు సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించింది. పట్టణ స్థాయిలో ప్రజలకు అందుతున్న వైద్య, ఆరోగ్య సేవల నాణ్యతను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.జిల్లా గణాంక అధికారి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో గర్భిణుల ముందస్తు నమోదు, రక్తపోటు (బీపీ), హిమోగ్లోబిన్‌ పరీక్షలు, ఐరన్‌–ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రల పంపిణీ తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందుతున్నాయా లేదా అనే విషయాలను అధికారులు సమీక్షించారు.అలాగే చిన్నారులకు నిర్ణీత సమయంలో టీకాలు వేయిస్తున్నారా, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక సంరక్షణ అందిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ డేటాను కూడా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు ఆర్‌సీహెచ్‌ (RCH) పోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సూచించారు. జిల్లా ఆసుపత్రికి ఓపీ సేవల కోసం వచ్చే ప్రతి ఒక్కరినీ ఈహెచ్‌ఆర్‌ (EHR) పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలకు అందించే ఆరోగ్య సేవల్లో నాణ్యత, పారదర్శకత, డిజిటల్‌ రికార్డుల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ తనిఖీల్లో ఆర్‌ఎంఓ డా. గోపాల్‌, వైద్యాధికారి డా. మురళీకృష్ణరెడ్డి, డీపీఓ నారాయణ, హెచ్‌ఎంఐఎస్‌ రాజశేఖర్‌, డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ రాఘవ, అరుంధతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!