ePaper
Friday, September 18, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఖలీల్ కృషితో.. దివ్యాంగ చిన్నారికి చేయూత

ఖలీల్ కృషితో.. దివ్యాంగ చిన్నారికి చేయూత

📰 Generate e-Paper Clip

 

–పింఛన్ కోసం ఆధార్ అప్డేట్ ప్రక్రియ పూర్తి

 

సలాం  ప్రొద్దుటూరు:

పింఛన్ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగ చిన్నారి కుటుంబానికి టీడీపీ నాయకుడు కే. ఖలీల్ బాషా చొరవతో చేయూత లభించింది.

 

అసర్ షరీఫ్ వీధికి చెందిన హలీమా అనే దివ్యాంగ చిన్నారికి పింఛన్ మంజూరుకు అవసరమైన ఆధార్ అప్డేట్ ప్రక్రియను బుధవారం పూర్తి చేయించారు.హలీమా కుటుంబ సభ్యులు పింఛన్ కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ప్రొద్దుటూరు టీడీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్, ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కే. ఖలీల్ బాషా ఈ విషయాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

 

అలాగే డాక్టర్ వి.ఎస్. ముక్తియార్, నంద్యాల కొండారెడ్డి తదితరుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ సహకారంతో పింఛన్ పొందేందుకు అవసరమైన ఆధార్ అప్డేట్‌తో పాటు సంబంధిత ప్రక్రియలను పూర్తి చేయించారు.

 

దీంతో పింఛన్ మంజూరుకు అవసరమైన ప్రక్రియలో ముందడుగు పడింది.హలీమా కుటుంబానికి అర్హత మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం సహకరిస్తామని కే. ఖలీల్ బాషా తెలిపారు. అవసరమైన ప్రభుత్వ సేవలను సకాలంలో అందించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని పేర్కొన్నారు.తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన కే. ఖలీల్ బాషా, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, డాక్టర్ వి.ఎస్. ముక్తియార్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తదితరులకు హలీమా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!