–తల్లి–బిడ్డల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక వైద్య సేవలు
సలాం ప్రొద్దుటూరు:
పట్టణంలోని గాంధీ రోడ్ లో వినాయక నగర్ పక్కన ఉన్న తల్లి–బిడ్డల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వైద్య సేవలు అందిస్తున్న జ్యోతి హాస్పిటల్ నాలుగో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. నాలుగేళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ, ముఖ్యంగా చిన్నారులు, నవజాత శిశువులు, గర్భిణులు, మహిళలకు అవసరమైన వైద్య చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.

చిన్నారులకు ప్రత్యేక వైద్య విభాగాలు
హాస్పిటల్‌లో పిల్లల వైద్య నిపుణుడు డా. కె. పవన్‌కుమార్ (MBBS, DNB – Pediatrics) ఆధ్వర్యంలో చిన్నారులకు వైద్య సేవలు అందుతున్నాయి. పిల్లల ఆరోగ్య సమస్యలకు చికిత్సతో పాటు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన PICU, NICU, CPAP వంటి ప్రత్యేక సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

మహిళలు, గర్భిణులకు వైద్య సేవలు
డా. డి. జ్యోతి (MBBS, MS – OBG) ఆధ్వర్యంలో మహిళలు, గర్భిణులకు వైద్య సేవలు అందిస్తారు. గర్భధారణ సమయంలో వైద్య పర్యవేక్షణ, ప్రసూతి సంబంధిత సేవలు, మహిళల ఆరోగ్య సమస్యలకు అవసరమైన చికిత్స అందుబాటులో ఉన్నాయన్నారు.
24 గంటల ఫార్మసీ, ఎక్స్‌రే, అంబులెన్స్
రోగులకు అత్యవసర సమయాల్లో సేవలు అందించేందుకు 24 గంటల ఫార్మసీ, ఎక్స్‌రే, అంబులెన్స్ సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. తల్లి–బిడ్డలకు సంబంధించిన అత్యవసర వైద్య పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నాలుగేళ్ల వైద్య సేవల ప్రస్థానం
జ్యోతి హాస్పిటల్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రి సేవలను మరింత విస్తరించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యులు, ప్రత్యేక చిన్నారుల వైద్య విభాగాలు, మహిళల వైద్య సేవలు, 24 గంటల అత్యవసర సదుపాయాలతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లి–బిడ్డల ఆరోగ్యానికి ప్రాధాన్యత.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా జ్యోతి హాస్పిటల్ నాలుగేళ్ల ప్రస్థానం కొనసాగుతోంది.
