సలాం ప్రొద్దుటూరు:
పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరులో మెగా అభిమానులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మెగా అభిమానులు చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అనంతరం ఆశ్రమానికి వచ్చిన వారికి అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు, మెగా అభిమానులు మధు చిరు రాయల్, షరీఫ్ టైర్స్, జనసేన అడ్వకేట్ రమేష్, రాము, బాబురావు, చెన్న రవి, ఇమామ్, చల్లా రవికుమార్, సుదర్శన్, నెట్ బాషా, సాగర్, నంద మెగా శ్యామ్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.చిరంజీవి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా అభిమానులు తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

