ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్శ్రీనివాస నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

శ్రీనివాస నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

 

–మాజీ కౌన్సిలర్ జీలాన్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ

సలాం  ప్రొద్దుటూరు:

శ్రీనివాస నగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ జీలాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానికులు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో చిన్నారులు జాతీయ జెండాలతో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!