శ్రీనివాస నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
–మాజీ కౌన్సిలర్ జీలాన్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ సలాం ప్రొద్దుటూరు: శ్రీనివాస నగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ జీలాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానికులు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చిన్నారులు జాతీయ జెండాలతో పాల్గొని దేశభక్తిని...