ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeఎడిటోరియల్వైఎస్ ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

వైఎస్ ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

📰 Generate e-Paper Clip

 

–పులివెందులలో కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ అధినేత

సలాం ప్రొద్దుటూరు(పులివెందుల):

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పులివెందులలో పర్యటించి, తన బంధువు వైఎస్ ఆనంద్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇటీవల వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన వైఎస్ ఆనంద్ రెడ్డికి ఆయన ఘనంగా నివాళులర్పించి తుది వీడ్కోలు పలికారు.

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పెదనాన్న అయిన వైఎస్ ఆనంద్ రెడ్డి (87) గురువారం పులివెందులలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి రెడ్డితో కలిసి ఆనంద్ రెడ్డి స్వగృహానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. తరువాత అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ ఆనంద్ రెడ్డికి ఘన నివాళులర్పించారు.:::

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!