ePaper
Sunday, August 2, 2026
ePaper
Homeఎడిటోరియల్వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా బండి వినీత్ రెడ్డికి శుభాకాంక్షలు

వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా బండి వినీత్ రెడ్డికి శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

 

–రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నివాసంలో యువ నాయకుల అభినందనలు

సలాం ప్రొద్దుటూరు:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అల్లుడు బండి వినీత్ రెడ్డి పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా శుక్రవారం పలువురు వైఎస్సార్సీపీ యువ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బండి వినీత్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. యువతకు పార్టీ బలోపేతంలో కీలక పాత్ర ఉందని, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా ఆయన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పిట్టా బాలాజీ, రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి మన్సూర్ ఇలాహి, దొరసానిపల్లె యువ నాయకుడు పాతకోట బలరామ్ రెడ్డి, మైనారిటీ యువ నాయకుడు అక్రమ్, రామాపురం యాకోబు, చౌటపల్లె అవినాష్ రెడ్డి, వారి మిత్రులతో పాటు రాచమల్లు యూత్ ఫోర్స్ (RYF) సభ్యులు, వైఎస్సార్సీపీకి చెందిన పలువురు యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!