ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeరాజకీయంఖాదర్ వలీ ఆధ్వర్యంలో 25వ వార్డులో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం

ఖాదర్ వలీ ఆధ్వర్యంలో 25వ వార్డులో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

సలాం   ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికీ టీడీపీ – డోర్ టు డోర్” కార్యక్రమాన్ని బుధవారం ప్రొద్దుటూరులోని 25వ వార్డులో ఘనంగా నిర్వహించారు.

స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్  నేతృత్వంలో 25వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి కమలాపురం షేక్ ఖాదర్ వలీ  పార్టీ నాయకులు, కార్యకర్తల తో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సమర్థవంతంగా అందేలా వారి సమస్యలు, అవసరాలు, సూచనలను తెలుసుకొని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరేలా పార్టీ శ్రేణులు ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేయాలని ఖాదర్ వలీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!