ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeరాజకీయం25వ వార్డులో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం..

25వ వార్డులో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం..

📰 Generate e-Paper Clip

– రెండేళ్ల పాలనను ప్రజలకు వివరించిన టీడీపీ నాయకులు

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలోని 25వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండా రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను వివరించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పార్టీ విధానాలను వివరించి చైతన్యపరిచారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ నాయకుడు నూరితో పాటు బూత్ ఇన్‌చార్జ్ హర్ష, ఇస్మాయిల్, నాగరాజు, మౌలా, మహబూబ్ బాషా మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!