ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్వివి కండ్రికలో భూ కబ్జాలు అరికట్టాలి..

వివి కండ్రికలో భూ కబ్జాలు అరికట్టాలి..

📰 Generate e-Paper Clip

–దళితులు , గిరిజనులకు భూములు ఇవ్వాలి..స్మశానం చూపాలి!!!

సలాం ప్రొద్దుటూరు (రైల్వే కోడూరు):

తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు మండలం, వివి కండ్రికలో సామాజిక శంఖారావం లో భాగంగా సోమవారం రాత్రి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా నాయకులు వందవాసి నాగరాజు, సిహెచ్.చంద్రశేఖర్, గ్రామంలో  పర్యటించి గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. అనేక సమస్యలను గ్రామ దళితులు జిల్లా నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ గ్రామంలో 130 సర్వే నెంబర్ల లో, 300 ఎకరాలు, 142సర్వే నంబర్లు 50 ఎకరాలు, అగ్రవర్ణ భూస్వాములు  రాత్రికి రాత్రి   జెసిపి మిషన్ లు పెట్టి కబ్జాలు చేస్తున్నారని. రెవెన్యూ అధికారులకు ధర్నాల ద్వారా ఫిర్యాదు చేసిన, పేరుకు హెచ్చరిక బోర్డులు పెట్టారని, వారి పని వారు చేస్తున్నారని, ఆందోళన వ్యక్తం చేశారు.  అగ్రవర్ణాల పైన ఆధారపడి వ్యవసాయ కూలీ తప్ప,  కొత్త పథకం తర్వాత ఉపాధి  పనులు పెట్టడం లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి స్మశానం కూడా  20 సెంట్లుఆక్రమణకు గురైందని, కనీసం రెండు ఎకరాలు స్మశానానికి దళితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. చెరువుకు పోయే దారి కూడా ఆక్రమణ కు గురైందన్నారు.  గ్రామ దళితులుకు అగ్రవర్ణాల గ్రామాల్లో దోసెట్లో నీళ్లు పోసే ఆచారం, కొనసాగుతుందని, స్వాతంత్రం వచ్చిన  79 సంవత్సరాలు తర్వాత కూడా అగ్రవర్ణాలు నుండి  తక్కువగా చూడడం,కుల వివక్షత కు గురవుతున్నామని, అందుకు కారణం కనీసం ఒక ఎకరా కూడా సొంత భూమి లేకపోవడమే అనే ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ,  భూకబ్జాలకు వ్యతిరేకంగానూ,భూమి  దక్కేవరకు, దళితులు, గిరిజనులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు, కెవిపిఎస్ పోరాటం ద్వారా సాధించిన జస్టిస్  పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు సిఫార్సు అమలు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలతో కలిసి, ఆక్రమణకు గురైన, దళితుల స్మశాన స్థలం, భూ కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను, పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!