సలాం ప్రొద్దుటూరు:
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రొద్దుటూరు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశ సభా ప్రాంగణాన్ని రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు తోట మహేశ్వర్ రెడ్డి, యువ నాయకుడు బచ్చల ప్రతాప్ తదితరులు పరిశీలించారు.
ఈ సందర్భంగా సభా ఏర్పాట్లు, భద్రత, వాహన పార్కింగ్, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన సూచనలు చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజు, ఏఎస్పీ రమణయ్య, ఏపీఎస్పీడీసీఎల్, ట్రాన్స్‌కో అధికారులు శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మీనారాయణ, రవీంద్రతో పాటు ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి పర్యటన విజయవంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు.
