ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్8 మంది అసిస్టెంట్ కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటన

8 మంది అసిస్టెంట్ కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటన

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు (అనంతపురం):

 

అనంతపురం జిల్లాలో 8 మంది అసిస్టెంట్ కలెక్టర్లు బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఏలూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఆదిత్య శర్మ, కృష్ణా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నమ్రత్ అగర్వాల్, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ పవన్ తేజ ఏఆర్, కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, అనంతపురం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సుయాస్ కుమార్, చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్ బన్న లు క్షేత్రస్థాయిలో పర్యటించారు.

జీడిపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్లు

ముందుగా బెలుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ ను వివిధ జిల్లాల అసిస్టెంట్ కలెక్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా జీడిపల్లి పంప్ హౌస్ వద్ద మండల తహసీల్దార్ వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జీడిపల్లి రిజర్వాయర్ భౌగోళిక స్థితిగతులను సంబంధిత శాఖ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ ను హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేపట్టడం జరిగిందని, పూర్తి నీటి సామర్థ్యం 1.6 టీఎంసీలని, జీడిపల్లి వరకు హంద్రీనీవా తొలిదశ ప్రాజెక్ట్ అని, తిరిగి జీడిపల్లి పంప్ హౌస్ నుండి హంద్రీనీవా రెండవ దశ ప్రాజెక్టుగా గెజిట్లో పేరు కూడా పడుతుందని, శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఎత్తిపోతలతో కృష్ణా జలాలు జీడిపల్లికి చేరుకుంటాయని, ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ల బృందానికి వివరించారు. రిజర్వాయర్ పరిసరాలు వ్యవసాయం పంటల సాగుపై మండల అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, మండల ఆర్ఐ నాగేష్ బాబు, హెచ్ఎన్ఎస్ఎస్ డిఈ రామసుబ్బయ్య, రిజర్వాయర్ ఏఈలు, తదితరులు పాల్గొన్నారు..అనంతరం ఆత్మకూరు మండలం మానిరేవు వద్ద ఎన్.లక్ష్మీదేవి అని రైతుకు చెందిన టమోటా పంటను పరిశీలించగా, మైక్రో ఇరిగేషన్ గురించి హార్టికల్చర్ డిడి ఉమాదేవి అసిస్టెంట్ కలెక్టర్లకు వివరించారు. ఈ సందర్భంగా టమోటా రైతులకు లబ్ధి ఎలా కలుగుతుంది, మార్కెట్ ఎక్కడ ఉంది, ధర ఎలా వస్తుంది, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, బెనిఫిట్స్ ఎంత వస్తుంది, నెట్ ఇన్కమ్ ఎంత తదితర వివరాలను ఆరా తీశారు. తదనంతరం ఆత్మకూరు గ్రామం వద్ద సుజాత అనే రైతుకు చెందిన మామిడి పంటలో డ్వామా ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజిఎస్ కింద చేపట్టిన డ్రైలాండ్ హార్టికల్చర్ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎంత లబ్ధి కలిగింది, ఎంత ఆర్థిక సహాయం వచ్చింది మార్కెట్ పరిస్థితి ఏంటి, తదితర వివరాలను రైతులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామం వద్ద ఐఓటి టెక్నాలజీ డివైస్ తో సాగుచేసిన హార్టికల్చర్ ప్లాంటేషన్ ను తనిఖీ చేయగా, స్థానిక వాతావరణ పరిస్థితులను రికార్డ్ చేసుకుని ఐఓటి టెక్నాలజీ ఇండికేషన్స్ ఇస్తా ఉంటుందని, ఎలాంటి రోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది, ఎలాంటి మందులు వాడాలి, తదితర వివరాలు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి సలీమ్ భాష, ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!