ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పేద మహిళకు వైద్య సాయం అందించేందుకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హామీ

పేద మహిళకు వైద్య సాయం అందించేందుకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి హామీ

📰 Generate e-Paper Clip

 

 

–ప్రజాదర్బార్‌లో సుబ్బమ్మ ఆరోగ్య పరిస్థితిని వివరించిన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్‌ నల్లబోతుల నాగరాజు

 

సలాం   ప్రొద్దుటూరు:

గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న నిరుపేద మహిళ కుంభ సుబ్బమ్మకు వైద్య చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో సుబ్బమ్మ ఆరోగ్య పరిస్థితిని వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

 

నాలుగు  బ్లాకేజీలు

 

ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కోటల ప్రాంతంలో, గర్ల్ హైస్కూల్ వెనుక నివాసం ఉంటున్న కుంభ సుబ్బమ్మకు గుండెకు సంబంధించిన నాలుగు  బ్లాకేజీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు నెలల క్రితం కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా రెండు బ్లాకేజీలకు స్టెంట్లు వేయించారు. మిగిలిన రెండు బ్లాకేజీలకు మరో రెండు స్టెంట్లు వేయించుకోవాలని వైద్యులు సూచించారు.అయితే, తదుపరి చికిత్సకు భారీ మొత్తంలో ఖర్చవుతుందని, ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్యం చేయించుకోవడం కష్టంగా మారిందని సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఎల్‌ఓసీ ద్వారా చికిత్సకు చర్యలు

 

సుబ్బమ్మ పరిస్థితిని తెలుసుకున్న రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్‌ నల్లబోతుల నాగరాజు, ఈవీ సుధాకర్‌రెడ్డి సహకారంతో ఆమెను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు తీసుకెళ్లి, వైద్య చికిత్సకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను వివరించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, సుబ్బమ్మకు అవసరమైన తదుపరి గుండె చికిత్స కోసం ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సుబ్బమ్మకు మెరుగైన వైద్యం అందుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!