ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడాలి

బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడాలి

📰 Generate e-Paper Clip

–వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

 

సలాం   ప్రొద్దుటూరు:

 

బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోందని రాచమల్లు తెలిపారు. అక్టోబర్ 12న ఈ అంశంపై విచారణ జరగనున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం మార్చకూడదని ఆయన పేర్కొన్నారు.

అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

అధికారులు రాజకీయ నాయకులు, కార్యకర్తల మాదిరిగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వహించాలని రాచమల్లు సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అధికార బలాన్ని ఉపయోగించినా అంతిమంగా ప్రజల తీర్పే కీలకమని ఆయన పేర్కొన్నారు.

బీసీలకు న్యాయం జరిగే వరకు ప్రశ్నిస్తాం

బీసీలకు న్యాయం జరిగే వరకు తమ వాణిని వినిపిస్తూ ప్రశ్నిస్తూనే ఉంటామని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల పరిరక్షణ విషయంలో తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!