–234 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సలాం ప్రొద్దుటూరు:
ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో గురువారం ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో జిల్లా అటవీ శాఖాధికారి ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు అటవీశాఖ పరిధిలోని బిక్కి తోట ప్రాంతం, నాగసాని బీడు, Lankamalla RF పరిసరాల్లో అటవీ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు అధికారుల రాకను గమనించి అక్కడి నుంచి పరారైనట్లు ఎఫ్ ఆర్ ఓ హేమాంజలి తెలిపారు.
234 కిలోల ఎర్రచందనం స్వాధీనం
అనంతరం అధికారులు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టగా, మొత్తం 7 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు సుమారు 234 కిలోలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అక్రమ రవాణాపై కఠిన చర్యలు
ఎర్రచందనం అక్రమ రవాణా, అక్రమ నరికివేతకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎఫ్ ఆర్ ఓ ఈ సందర్భంగా హెచ్చరించారు. అటవీ సంపదను కాపాడేందుకు ప్రజలు కూడా సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.
