–జిల్లా స్థాయి ఎంపికల్లో నాలుగు బంగారు పతకాలు.. తాడిపత్రిలో జరిగే 70వ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత
సలాం ప్రొద్దుటూరు:
జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో ఎంపిక పోటీల్లో ప్రొద్దుటూరుకు చెందిన ‘మై స్పేస్ తైక్వాండో అకాడమీ’ క్రీడాకారులు సత్తా చాటారు. జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న నిర్వహించిన ఎంపిక పోటీల్లో అకాడమీకి చెందిన నలుగురు క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి బంగారు పతకాలు సాధించారు.అండర్–17 బాలుర విభాగంలో ఎన్. హేమంత్ 35 కేజీల విభాగంలో, ఎస్. అఫ్రీది 46 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించారు. అండర్–17 బాలికల విభాగంలో ఎన్. యోగిత 40 కేజీల విభాగంలో, ఎన్. జాహ్నవి 55 కేజీల విభాగంలో బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు.ఈ విజయంతో నలుగురు క్రీడాకారులు అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో తాడిపత్రిలో జరగనున్న 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీలకు జిల్లా తరఫున పాల్గొనేందుకు అర్హత సాధించారు.ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను మై స్పేస్ తైక్వాండో అకాడమీ డైరెక్టర్ సలీమ్ అభినందించారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించిన కోచ్‌లు బాషా, సంతోష్లను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జిల్లాకు, ప్రొద్దుటూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.జిల్లా స్థాయిలో మెరిసిన ఈ యువ తైక్వాండో క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలోనూ పతకాల వేట కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.
