ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కామనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

కామనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

 

 

–53 మందికి కంటి పరీక్షలు.. 23 మంది శస్త్రచికిత్సలకు ఎంపిక

 

సలాం ప్రొద్దుటూరు –  కామనూరు:

రోటరీ సర్వీస్ కాంప్లెక్స్ ట్రస్ట్ ప్రొద్దుటూరు, జిల్లా అంధత్వ నివారణ సొసైటీ కడప సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ప్రొద్దుటూరు మండలం కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు.రోటరీ కంటి ఆసుపత్రి అధ్యక్షుడు ఎం.వి.ఎన్. ప్రభు అధ్యక్షతన జరిగిన ఈ శిబిరాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొంటూ రోటరీ సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు.శిబిరంలో వైద్య బృందం గ్రామస్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించింది. మొత్తం 53 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 23 మంది శస్త్రచికిత్సలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి తదుపరి చికిత్స, శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రోటరీ ఐ హాస్పిటల్ కార్యదర్శి బేపారి జాకీర్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ టి. బాల సూర్యరావు, వైద్య బృందం సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!