–1.37 లక్షలకుపైగా ఓటర్లు.. ఒక్కో కేంద్రానికి సగటున 880 మంది ఓటర్లు
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో ప్రతిపాదించిన 156 పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించినట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కమిషనర్ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు పట్టణంలో మొత్తం 1,37,202 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పట్టణంలో మొత్తం 156 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించగా, ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 880 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.ప్రచురించిన పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రజల పరిశీలన కోసం పురపాలక సంఘం కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయాలు తదితర ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ వెల్లడించారు.పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రజలు పరిశీలించి, తమకు సంబంధించిన కేంద్రాల వివరాలను తెలుసుకోవాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ టి. కృష్ణా సింగ్ ఠాగూర్, సీనియర్ సహాయకులు జీ. మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
