–ముగ్గురు అరెస్ట్.. ఒకరు పరారీ
–5 చర్మాలు, 23 పులి గోర్లు స్వాధీనం
సలాం ప్రొద్దుటూరు:
వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును అటవీశాఖ అధికారులు రట్టు చేశారు. మైదుకూరులోని ఫారెస్ట్ స్పెషల్ టీమ్ నిర్వహించిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారయ్యాడు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల నుంచి 5 వన్యప్రాణుల చర్మాలు, 23 పులి గోర్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చర్మాలను పరిశీలించగా, వాటిలో ఒక దుప్పి చర్మం మాత్రమే అసలైనదిగా, మిగిలిన పులి చర్మాలు నకిలీవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.ఈ స్మగ్లింగ్ వ్యవహారానికి కడప పట్టణంతో బలమైన సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను విచారణ అనంతరం వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి (DFO) టి. రాజశేఖర్ బాబు, ప్రొద్దుటూరు సబ్ DFO సంకేత్ సునీల్ గరుడ్ (IFS), FRO హేమాంజలి, నయంఅలి తదితరులు పాల్గొన్నారు.
