ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ ఖాజీగా మదీనా మస్జిద్ ఇమామ్ ఖాజా భాష మౌలానా

ప్రభుత్వ ఖాజీగా మదీనా మస్జిద్ ఇమామ్ ఖాజా భాష మౌలానా

📰 Generate e-Paper Clip

–25 ఏళ్ల ఇమామత్ సేవలకు మరో గౌరవ బాధ్యత

— ఉలమా ఏక్రామ్, ముస్లిం పెద్దల అభినందనలు

సలాం ప్రొద్దుటూరు:

పట్టణంలోని పాత బస్టాండ్‌లో ఉన్న మదీనా మస్జిద్ ఇమామ్ జనాబ్ ఖాజా భాష మౌలానాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఖాజీగా నియమించడం పట్ల ముస్లిం సమాజంలో హర్షం వ్యక్తమవుతోంది. మతపరమైన సేవలు, ఇమామత్, సామాజిక కార్యక్రమాల్లో విశేషంగా సేవలందిస్తున్న ఖాజా భాష మౌలానాకు ఈ బాధ్యత దక్కడం పట్ల ఉలమా ఏక్రామ్, ఐమ్మా, ముస్లిం పెద్దలు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మదీనా మస్జిద్ అధ్యక్షులు జనాబ్ బొల్లవరం బాషా భాయ్, ప్రముఖ ఉలమా ఏక్రామ్ కలిసి రాష్ట్ర షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. వి.ఎస్. ముక్తియార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖాజా భాష మౌలానాకు ప్రభుత్వ ఖాజీగా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.

25 ఏళ్లుగా ఇమామత్ సేవలు

ఖాజా భాష మౌలానా గత 25 సంవత్సరాలుగా మదీనా మస్జిద్ ఇమామ్‌గా నిరంతరంగా సేవలందిస్తున్నారు. ఖుర్‌ఆన్, హదీస్, ఇస్లామిక్ బోధనలు, నికాహ్ తదితర మతపరమైన విషయాల్లో ప్రజలకు మార్గనిర్దేశం చేస్తూ సమాజంలో సేవాభావంతో కొనసాగుతున్నారు. ప్రస్తుతం నగర ఉలమా–ఐమ్మా కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

“అల్లాహ్ తఆలా దయతోనే ఈ బాధ్యత”

ఈ సందర్భంగా ఖాజా భాష మౌలానా మాట్లాడుతూ, “అల్‌హమ్దులిల్లాహ్… అల్లాహ్ తఆలా దయ, పెద్దల ఆశీస్సులు, ఉలమా ఏక్రామ్ దువాలు, ముస్లిం సోదరుల ప్రార్థనల వల్లే ఈ బాధ్యత నాకు లభించింది” అని పేర్కొన్నారు.

ప్రభుత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని గౌరవిస్తూ, ఖాజీగా అప్పగించిన బాధ్యతలను ఇస్లామిక్ సంప్రదాయాలు, షరీఅత్ సూత్రాలు, న్యాయబద్ధతకు అనుగుణంగా అంకితభావంతో నిర్వహిస్తానని తెలిపారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం పెంపొందేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

ఉలమా ఏక్రామ్ శుభాకాంక్షలు

ఖాజా భాష మౌలానా ప్రభుత్వ ఖాజీగా నియమితులైన సందర్భంగా మదీనా మస్జిద్ కమిటీ సభ్యులు, ఉలమా ఏక్రామ్, ఐమ్మా, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు అల్లాహ్ తఆలా మరింత తౌఫీక్ ప్రసాదించి, అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే శక్తిని ప్రసాదించాలని దువా చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!