ePaper
Thursday, October 1, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 52 వార్డులకు రిజర్వేషన్ల ముసాయిదా జాబితా విడుదల

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 52 వార్డులకు రిజర్వేషన్ల ముసాయిదా జాబితా విడుదల

📰 Generate e-Paper Clip

–ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో వార్డుల పునర్విభజన అనంతరం 52 వార్డులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన G.O.RT.No.1165, తేదీ 21-09-2026తో పాటు కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు.

ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని 52 వార్డులకు సంబంధించి వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల ముసాయిదా జాబితాను సెప్టెంబర్ 26న ప్రజల పరిశీలనార్థం ప్రచురించారు. ఈ జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రిజర్వేషన్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు లేదా సూచనలు ఉన్న వార్డు ప్రజలు సెప్టెంబర్ 28, 2026 సాయంత్రం 5 గంటలలోపు ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయంలో సమర్పించాలని అధికారులు సూచించారు. గడువు అనంతరం అందే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.

ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం తుది రిజర్వేషన్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్ల అంశం కీలక దశకు చేరుకుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!