ePaper
Thursday, September 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆ దేవుని.. తొలి నిమజ్జనం..

ఆ దేవుని.. తొలి నిమజ్జనం..

📰 Generate e-Paper Clip

 

–పెద్దశెట్టిపల్లిలో అధికారికంగా ప్రారంభమైన గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం

 

సలాం ప్రొద్దుటూరు:

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లి సమీపంలో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం  ప్రారంభమైంది. గణనాథుడి తొలి నిమజ్జనాన్ని మంగళవారం ఉదయం 7:35 గంటలకు ప్రొద్దుటూరు కొత్తపేటకు చెందిన  రాజేష్ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

 

పెద్దశెట్టిపల్లి వద్ద అధికారిక నిమజ్జన ఏర్పాట్లు

 

పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని పెద్దశెట్టిపల్లి సమీపంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులు నిమజ్జన కార్యక్రమానికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ విజ్ఞప్తి చేశారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP)తో తయారైన విగ్రహాలను కుందూ నదిలో నిమజ్జనం చేయడం నిబంధనలకు విరుద్ధమని, పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్దశెట్టిపల్లి వద్ద ఏర్పాటు చేసిన అధికారిక నిమజ్జన ప్రాంతాన్ని వినియోగించాలని ఆయన సూచించారు.

 

తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక ఏర్పాట్లు

 

పెద్దశెట్టిపల్లి నిమజ్జన ప్రాంతాన్ని అవసరమైన సదుపాయాలతో అభివృద్ధి చేసి, గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు.ఉత్సవాల తొమ్మిది రోజుల పాటు ప్రొద్దుటూరు పురపాలక సంఘం, పోలీస్ శాఖ, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

కుందూ నదిని కాపాడుకుందాం

 

“పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కుందూ నదిని కాలుష్యం కాకుండా కాపాడేందుకు అధికారికంగా ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాన్ని వినియోగించాలి. గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులు అధికారులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ విజ్ఞప్తి చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!