ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విద్యార్థినుల విద్యాభివృద్ధికి రోటరీ క్లబ్ చేయూత

విద్యార్థినుల విద్యాభివృద్ధికి రోటరీ క్లబ్ చేయూత

📰 Generate e-Paper Clip

 

–ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 160 మందికి ఉచితంగా విద్యా సామగ్రి పంపిణీ

 

సలాం ప్రొద్దుటూరు:

విద్యార్థినుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు గణిత నైపుణ్యాలు, విద్యపై ఆసక్తిని ప్రోత్సహించేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో విద్యా సహాయ కార్యక్రమం నిర్వహించారు. ప్రొద్దుటూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థినులకు డ్రాయింగ్ పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, రైటింగ్ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించవచ్చన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు ఇలాంటి సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు, వారు ఆత్మవిశ్వాసంతో విద్యను కొనసాగించేందుకు రోటరీ క్లబ్ తరఫున భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమానికి రొటేరియన్లు కె. మల్లికార్జున, గజ్జల వెంకటేశ్వర రెడ్డి, కె. సునీల్ కుమార్, ఎస్. వెంకటేశ్వర్లు స్పాన్సర్లుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు గుర్రం రామకృష్ణ, ఎం. సూర్యనారాయణ రెడ్డి, తిరుమల బాల సూర్యరావు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు కొవ్వూరు రవికుమార్ రెడ్డి, రొటేరియన్లు అగ్గారపు వెంకటేశ్వర్లు, తిరుమల మురళి తదితరులు పాల్గొన్నారు.విద్యార్థినులకు ఉచితంగా విద్యా సామగ్రి అందించిన రోటరీ క్లబ్ సభ్యులు, స్పాన్సర్లకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!