ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeఎడిటోరియల్“కమిషనర్‌తో ముఖాముఖి”కు విశేష స్పందన

“కమిషనర్‌తో ముఖాముఖి”కు విశేష స్పందన

📰 Generate e-Paper Clip

 

–నాలుగు వారాల్లో 71 ఫిర్యాదులు.. 30 సమస్యలకు పరిష్కారం

 

సలాం    ప్రొద్దుటూరు:

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ప్రొద్దుటూరు పురపాలక సంఘం నిర్వహిస్తున్న “కమిషనర్‌తో ముఖాముఖి” ఫోనింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నాలుగు వారాల వ్యవధిలో మొత్తం 71 ఫిర్యాదులు అందగా, వాటిలో తక్షణ పరిష్కారానికి అవకాశం ఉన్న 30 సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు.జూలై 27, 2026 నుంచి వరుసగా నాలుగు వారాలపాటు ప్రతి వారం నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా మున్సిపల్ యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా వీధిలైట్లు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, రహదారులు, ఆక్రమణలు, ట్రాఫిక్, ఆవులు, కుక్కలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ వివరించారు.ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో మంచినీటి సరఫరా, పారిశుధ్యం, వీధిలైట్లు, ట్రాఫిక్ తదితర అంశాలకు సంబంధించిన 30 సమస్యలను సంబంధిత విభాగాల ద్వారా ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు.మిగిలిన సమస్యలను కూడా ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతతో స్వీకరించి, పరిష్కారం దిశగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా మున్సిపల్ యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేందుకు “కమిషనర్‌తో ముఖాముఖి” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పారదర్శకంగా, స్పందనాత్మకంగా పనిచేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!