ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఎడిటోరియల్స్వాతంత్ర్య స్ఫూర్తితో.. మైదుకూరులో మువ్వన్నెల సంబరం!

స్వాతంత్ర్య స్ఫూర్తితో.. మైదుకూరులో మువ్వన్నెల సంబరం!

📰 Generate e-Paper Clip

 

–ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఆదేశాలతో మార్కెట్‌ యార్డు, చాపాడు సచివాలయం, ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఘనంగా జెండా వందనం

 

సలాం ప్రొద్దుటూరు –   మైదుకూరు/చాపాడు:

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మైదుకూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైదుకూరు ఎమ్మెల్యే  పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఆదేశాల మేరకు మైదుకూరు మార్కెట్‌ యార్డు, చాపాడు గ్రామ స్వర్ణ సచివాలయం, జిల్లా పరిషత్‌ ఉర్దూ ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు.

 

మార్కెట్‌ యార్డులో ఘనంగా జెండా వందనం

 

మైదుకూరు మార్కెట్‌ యార్డులో చైర్మన్‌ ఏపీ రవీంద్ర ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాయబ్‌ రసూల్‌, డైరెక్టర్లు హాసేన బి, ఆశీర్వాదం, నర్సిమగౌడ, సరిటాల వీరయ్య, రమణయ్య, వెంకట సుబ్బయ్య, జయలక్ష్మి, వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

ముఖ్య అతిథులుగా చాపాడు మండల టీడీపీ అధ్యక్షుడు వై.వి. సుబ్బారెడ్డి, అక్బర్‌ సలీం, దువ్వూరు శేషయ్య హాజరయ్యారు. టీడీపీ నాయకులు, మార్కెట్‌ కమిటీ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.

 

స్వర్ణ సచివాలయంలో దేశభక్తి నినాదాలు

 

చాపాడు మండలం చాపాడు గ్రామంలోని స్వర్ణ సచివాలయంలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీవో రత్న రాజు, టీడీపీ నాయకులు అక్బర్‌ సలీం, రాజోలి బయాపు రెడ్డి తదితరులు పాల్గొని జెండా వందనం చేశారు.

 

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేష్‌బాబు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సుప్రజ, ఈసీ రాజా, లైబ్రేరియన్‌ శివశంకర్‌ రెడ్డి, టీడీపీ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సందడి

 

చాపాడు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉర్దూ ఉన్నత పాఠశాలలో కూడా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కమిటీ చైర్మన్‌ అలీ, కో-ఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌ సలీం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు శర్మ, ఉపాధ్యాయులు ఫిరోజ్‌, ఇస్మాయిల్‌ తదితరులు విద్యార్థులతో కలిసి జెండా వందనం చేశారు.

 

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!