ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్మహిళలకు రాజకీయాల్లో 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలి

మహిళలకు రాజకీయాల్లో 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలి

📰 Generate e-Paper Clip

 

 

_ఐద్వా నాయకుల డిమాండ్

 

సలాం ప్రొద్దుటూరు:

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరులోని వైవీఎస్ హైస్కూల్‌లో ఐద్వా ఆధ్వర్యంలో విద్యార్థులకు జాతీయ పతాక బ్యాడ్జీలను పంపిణీ చేశారు. ఎంఈఓ శోభారాణి విద్యార్థులకు బ్యాడ్జీలు అందజేశారు.

 

ఈ సందర్భంగా ఐద్వా ప్రొద్దుటూరు పట్టణ కార్యదర్శి జి. ప్రేమ, అధ్యక్షురాలు వై. విజయమ్మ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ మహిళలకు సంపూర్ణ స్వేచ్ఛ, భద్రత అందడం లేదని అన్నారు. మహిళలు అర్ధరాత్రి కూడా ఒంటరిగా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఏర్పడాల్సి ఉందని పేర్కొన్నారు.

 

మహిళలకు పార్లమెంటులో 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళలకు సమాన అవకాశాలు, భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు సర్వేశ్వరి, వెంకటసుబ్బమ్మ, భానుమతి, పుష్పలత, లక్ష్మీదేవి, శ్రామిక మహిళా కన్వీనర్ గురమ్మతో పాటు వైవీఎస్ హైస్కూల్ హెడ్‌మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!