ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్ఘనంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు

ఘనంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

 

సలాం   ప్రొద్దుటూరు:

ఆషాఢ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు పరిధిలోని సుబ్బిరెడ్డికొట్టాల, దొరసానపల్లి రోడ్డులో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

 

అమ్మవారిని దర్శించుకున్న డా. వి.ఎస్. ముక్తియార్

 

ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ మోతకూరి సుబ్బయ్య ఆహ్వానం మేరకు దొరసానపల్లి రోడ్డులోని శ్రీ చౌడేశ్వరి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.

 

శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న సి.ఎం. సురేష్ నాయుడు

 

టీడీపీ రాష్ట్ర నాయకులు శ్రీ సి.ఎం. సురేష్ నాయుడు సైతం మోతకూరి సుబ్బయ్య ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరిపై శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, సర్వజనులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

 

సుబ్బిరెడ్డికొట్టాలలో ఘనంగా అమ్మవారి జన్మదిన వేడుకలు

 

సుబ్బిరెడ్డికొట్టాలలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి వెల్లడించారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని భక్తులు ప్రార్థించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!