



సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్ ,వినాయక నగర్ ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటికీ తెలుగు దేశం” కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లిన ఆయన కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలను వివరించిన ఆయన, ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కామిశెట్టి బాబు, టప్పా మహబూబ్ భాషా, ప్రొద్దుటూరు టౌన్ మాజీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు షామీర్ భాషా, జిల్లెళ్ల వెంకటేష్, ఉట్ల మల్లేష్, రాము నాయుడు, గిద్దలూరు ఈశ్వరయ్య, సీజే సుబ్బయ్య, మేస్త్రి భాషాతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
