ePaper
Friday, July 31, 2026
ePaper
Homeఎడిటోరియల్27వ వార్డులో ఇంటింటికీ ఎమ్మెల్యే వరద ప్రచారం

27వ వార్డులో ఇంటింటికీ ఎమ్మెల్యే వరద ప్రచారం

📰 Generate e-Paper Clip

–రెండేళ్ల కూటమి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే

 

సలాం ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న “నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 27వ వార్డులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే సామాజిక పింఛన్లను రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచి హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు.

 

అదేవిధంగా “తల్లికి వందనం” పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ప్రతి మహిళకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. పేదల కోసం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించామని, మహిళలకు ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, నిరుపేద ఆటో డ్రైవర్లకు “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు.

 

ఈ కార్యక్రమంలో టీడీపీ కడప పార్లమెంట్ కార్యదర్శి తలారి పుల్లయ్య, క్లస్టర్ ఇన్‌చార్జి తలారి రమేష్, తలారి సన్నీ, తలారి ఓబులేసు, జెర్మియా, డీలర్ మోషన్, చిన్న, ధనరాజ్, తలారి ప్రవీణ్, నాగేంద్ర, జాషువా, చరణ్, భాస్కర్, శ్యామ్, మేడిగా రాజు, సునీల్, లడ్డు, శివారెడ్డి, బాలు, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

 

అలాగే ప్రొద్దుటూరు టీడీపీ పరిశీలకులు కొండవీటి భావన, టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబివుల్లా, అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి, వద్ది బాలుడు, నందం రామయ్య, వంగనూరు మురళీధర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంకదర నరేంద్రరావు, జనసేన నాయకులు సుంకర మురళి, పగిడాల దస్తగిరి, రిటైర్డ్ ఎస్‌ఐ శంకర్, మహిళా నాయకులు లక్ష్మీ, నాగవేణి, లక్ష్మీదేవి, అలివేలు, భవాని గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!