ePaper
Friday, July 31, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్శాంతికుమారి వీధిలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం

శాంతికుమారి వీధిలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పట్టణంలోని 25వ వార్డు లోని శాంతకుమారి వీధిలో ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా టీడీపీ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పన, నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నూరి, ఇస్మాయిల్, హర్ష, నాగరాజు, ఆబిడ్, మగబుల్, మహమూద్, చోటు, బహదూర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి కార్యక్రమానికి మంచి స్పందన లభించినట్లు వారు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!