ePaper
Friday, July 31, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఎన్‌జీఓస్ సంఘం ప్రతినిధులు

మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఎన్‌జీఓస్ సంఘం ప్రతినిధులు

📰 Generate e-Paper Clip

 

–సంఘం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ

– కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌కు ఘన సన్మానం

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్‌జీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ జె. రామసుబ్బయ్య యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌ను సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ, తనకు ఏపీ ఎన్‌జీఓస్ సంఘంపై ప్రత్యేక అభిమానం ఉందని, తాను కూడా సంఘం నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తినని, ఏపీ ఎన్‌జీఓస్ సంఘంలో సభ్యుడిగా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, పరిపాలనలో సమన్వయంతో ముందుకు సాగేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

 

అనంతరం సంఘం అధ్యక్షుడు జె. రామసుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ, మున్సిపల్ పరిపాలనలో కమిషనర్‌కు సంఘం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.

 

ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షుడు, కార్యదర్శి ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో తాలూకా కార్యదర్శి ఇ. ప్రమీల, ఉమెన్ వింగ్ చైర్మన్ అరుణాదేవి, వైస్ ప్రెసిడెంట్ నాగార్జున, వరప్రసాద్, ఆర్గనైజేషన్ సెక్రటరీ ప్రభంజన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుజాత, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పేరయ్య, కార్యదర్శి ఓంకార్, ఉమెన్ వింగ్ సభ్యురాలు రాజ్యలక్ష్మి, మహేశ్వరయ్య, సుధాకర్‌తో పాటు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!