ePaper
Thursday, July 30, 2026
ePaper
Homeఎడిటోరియల్పెన్నానగర్ 18వ వార్డులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం

పెన్నానగర్ 18వ వార్డులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

–కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజలకు వివరించిన నాయకులు

 

సలాం ప్రొద్దుటూరు:

తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “ఇంటింటికీ టీడీపీ” కార్యక్రమం ప్రొద్దుటూరు పట్టణంలోని పెన్నానగర్ 18వ వార్డు, 203వ బూత్ పరిధిలో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

 

ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ విజయాలను ప్రతి ఇంటికి చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు.

 

ఈ కార్యక్రమంలో 18వ వార్డు ఇన్‌చార్జి షేక్ షరీఫ్ , 203వ బూత్ ఇన్‌చార్జి నాదెండ్ల షరీఫ్, టీడీపీ నాయకుడు సుబ్బరాయుడు , వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల నుంచి కార్యక్రమానికి విశేష స్పందన లభించినట్లు నాయకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!