ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్వసతి గృహాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

వసతి గృహాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

–ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్.

సలాం ప్రొద్దుటూరు (కడప):-

రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల వసతిగృహాల మూసివేత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఓం శాంతి నగర్ లోని ఏ.ఐ.ఎస్.బి కార్యాలయంలో వారు మాట్లాడుతూ…

రాష్ట్ర వ్యాప్తంగా 54 వెనుకబడిన తరగతుల వసతి గృహాలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దుర్మార్గం అని వారు అన్నారు. వెనుకబడిన వసతిగృహాలలో రెగ్యులర్ వార్డెన్ లను నియమించకుండా ఇంచార్జ్ లతో కాలం గడుపుతూ హాస్టల్స్ పై సరైన పర్యవేక్షణ లేకుండా విద్యార్థులు లేరు అనే సాకుతో హాస్టల్స్ మూసివేసి రాష్ట్ర వ్యాప్తంగా 10 నూతన రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి విదార్థులను మెర్జ్ చేసి 54 హాస్టల్స్ మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని వారు అన్నారు. బి.సి వసతి గృహాలలో కాళిగా ఉన్న వార్డెన్ పోస్టులు భర్తీ చేసి ప్రతి హాస్టల్ కి రెగ్యులర్ వార్డెన్ ను నియమించకుండా హాస్టల్స్ మూసివేసి విద్యార్థుల సంక్షేమం బాధ్యలతల నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బి.సి విద్యార్థులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు భర్తీ చేసి ప్రతి హాస్టల్స్ కి రెగ్యులర్ వార్డెన్ లను నియమించి విద్యార్థులకు అండగా నిలబడాలని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 నూతన రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటును స్వాగతిస్తామని కానీ ఆ సాకుతో 54 హాస్టల్స్ మూసివేస్తామంటే మాత్రం ఊరుకోబోమని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకుంటే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.బి నాయకులు సుమంత్, అఖిల్, చరణ్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!