–రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌కు ప్రతిభావంతుల ఎంపిక
– కడప జిల్లా క్రీడాకారులకు ఆహ్వానం
సలాం ప్రొద్దుటూరు:
కడప జిల్లా యువ అథ్లెట్లలో ప్రతిభను వెలికితీసి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసే లక్ష్యంతో భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్-18, అండర్-20 స్త్రీ, పురుషుల అథ్లెటిక్స్ పోటీలు ఆగస్టు 2న (ఆదివారం) ఉదయం 9 గంటలకు ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అండర్-18 విభాగంలో 18-09-2008 నుంచి 17-09-2010 మధ్య జన్మించిన వారు, అండర్-20 విభాగంలో 18-09-2006 నుంచి 17-09-2008 మధ్య జన్మించిన స్త్రీ, పురుష క్రీడాకారులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. పోటీల్లో 100, 200, 400, 1000 మీటర్ల పరుగులు, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆగస్టు 11, 12, 13 తేదీల్లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో జరిగే రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాలంటే క్రీడాకారులు 16 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాల్సి ఉంటుందని సూచించారు.
పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వయస్సు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వివరాలను భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి వై. అహ్మర్ భాషా, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బసిరెడ్డి వీర కళ్యాణ్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 99496 86586, 80198 80995.
