కూటమి పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమం చేరింది: టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీబుల్లా
సలాం ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని టిడిపి పాలన లో ప్రతి ఇంటికి సంక్షేమం చేరిందని టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీబుల్లా హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు....