ప్రొద్దుటూరులో ట్రాఫిక్ నిర్వహణపై సమీక్ష

    –ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి భద్రతపై అధికారులతో కమిషనర్ చర్చ   సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పనితీరు మెరుగుదలతో పాటు రహదారి భద్రతకు సంబంధించిన అంశాలపై సోమవారం పురపాలక సంఘం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.   మున్సిపల్ కమిషనర్  తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్గొని పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, సిగ్నల్స్ నిర్వహణ, ట్రాఫిక్...